Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హరిద్వార్ లో బయటపడ్డ ఐఎస్ఐఎస్ లింకు...రైలు పేల్చడానికి కుట్ర

ఐఎస్ఐఎస్ లింకులు హరిద్వారలో బయటపడ్డాయి. హరిద్వార్ లో యూసఫ్, షఫీ అమర్ లను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని, ఐఎస్ కు మద్దతు పెంచుతున్నట్టు గుర్తించారు. ముంబై, మంగుళూరు, హైదరాబాదు నగరాల్లో మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై, హైదరాబాదుల్లో పట్టుబడిన వ్యక్తుల నుంచి ఐఈడీ స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు, వారి మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నలుగురు సభ్యులతో షఫి దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తించారు. రైళ్లను పేల్చివేసే కుట్రకు ప్లాన్ రెడీ చేసినట్టు అధికారులు గుర్తించారు. అలాగే అపార్ట్ మెంట్ల వద్ద పేలుళ్లకు పాల్పడాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు అధికారులు నిర్ధారించారు.

More Telugu News